సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.!
- July 26, 2023వర్షాకాలం వచ్చిందంటే సైనస్ మరింత విజృంభిస్తుంది. ఆ మాటకొస్తే, వాతావరణంలో ఏ మార్పు వచ్చినా సైనస్ సమస్య వున్న వాళ్లు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంతేకాదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లూ, వైరల్ ఇన్పెక్షన్లు కూడా సైనస్ వ్యాధి గ్రస్తుల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుంటాయ్.
సైనస్ కారణంగా రెండు ముక్కులు దిబ్బడ వేసి, శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దాంతో పాటూ, ముఖం ఉబ్బరంగా వుండడం, భరించలేని తలనొప్పి.. తదితర సమస్యలు వేధిస్తుంటాయ్.
ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మందులు ఎన్ని వున్నా అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. యోగాతో సైనస్‌కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
కొన్ని యోగాసనాలు ముక్కులోని గాలి రంధ్రాలను తెరిచి సైనసైటిస్ లక్షణాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయ్. అలాగే ఊపిరితిత్తుల్ని విస్తరించడంలోనూ యోగా తోడ్పడుతుంది. ఆక్సిజన్ తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుతాయ్.
ముఖ్యంగా యోగాలో భుజంగాసనం సైనస్ సమస్యను దూరం చేసేందుకు ఎక్కువ షహాయపడుతుందని చెబుతున్నారు. ఛాతీ, ఊపిరితిత్తులను విస్తరించేలా చేసి గుండెకూ బలాన్ని చేకూరుస్తుంది ఈ ఆసనం.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు