శుద్రపూజల పేరిట మోసం. 7 మందికి జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌ల జరిమానా

- July 27, 2023 , by Maagulf
శుద్రపూజల పేరిట మోసం. 7 మందికి జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌ల జరిమానా

యూఏఈ: శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యూఏఈలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వారికి 50,000 దిర్హామ్‌ల జరిమానా కూడా విధించారు. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం కేసు వివరాలను వెల్లడించింది. నిందితుల ముఠాలోని సభ్యులు తమకు జిన్ రాజుల శక్తి(అదృశ్య శక్తులు) ఉన్నాయని పలువురిని నమ్మించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలను దూరం చేసే అనేక శక్తులు ఉన్నాయని నమ్మించి పలువురిని మోసం చేశారు. చేతబడి చేయడం, మోసం, శుద్రపూజల వంటి ఆరోపణలపై ఏడుగురిని కోర్టుకు తరలించారు. తరువాత వారికి 6 నెలల జైలు శిక్ష, జ్యుడీషియల్ ఫీజుతో పాటు 50,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నేరాలు,  జరిమానాల చట్టాన్ని జారీ చేసే ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021 ప్రకారం, చేతబడి మరియు మోసం భారీ జరిమానాలతో శిక్షించదగిన నేరాలు అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పునరుద్ఘాటించింది. చేతబడికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే తమకు తెలియజేయాలని అధికారులు నివాసితులకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com