ఆ ప్రాంతాల్లో వ్యర్థాలను డంపింగ్ చేస్తే OMR1,000 జరిమానా

- July 27, 2023 , by Maagulf
ఆ ప్రాంతాల్లో వ్యర్థాలను డంపింగ్ చేస్తే OMR1,000 జరిమానా

మస్కట్: నిర్దేశించని ప్రాంతాలలో వ్యర్థాలను డంప్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే కాంట్రాక్టర్లు, లారీ డ్రైవర్లకు OMR1,000 వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. పర్యావరణానికి హాని కలిగించే వారి నుండి పర్యావరణాన్ని రక్షించడానికి మున్సిపల్ ఆదేశాలు, చట్టాలు బలంగా ఉన్నాయని గుర్తుచేసింది. రక్షిత ఆరోగ్యం, పరిపాలనా నిర్ణయం 2017/55పై స్థానిక ఆర్డర్ 1/2006లోని ఆర్టికల్ 11 ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించనున్నట్టు ప్రకటించింది. మునిసిపల్ లైసెన్సులను నియంత్రించే విధానాలు కాంట్రాక్టర్లు లేదా ఇంటి యజమానిని నిర్మాణం పూర్తయిన తర్వాత సైట్‌ను క్లీన్ చేయాలని సూచించింది. రాయల్ డిక్రీ నం. 38/2015 ద్వారా జారీ చేయబడిన మస్కట్ మునిసిపాలిటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పరిపాలనాపరమైన ఆంక్షల కోసం ప్రత్యేకంగా పరిపాలనా నిర్ణయం నెం. 55/2017 తీసుకొచ్చినట్టు తెలిపింది.  బహిరంగ ప్రదేశాలలో లేదా వాడీల్లో వ్యర్థాలను విసిరే వారికి OMR1,000 జరిమానా విధించబడుతుంది. ఉల్లంఘటనలు పునరావృతమైతే, జరిమానా రెట్టింపు అవుతుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com