సందర్శకులను ఆకట్టుకుంటున్నసౌక్ వాకిఫ్ డేట్స్ ఫెస్టివల్‌

- July 28, 2023 , by Maagulf
సందర్శకులను ఆకట్టుకుంటున్నసౌక్ వాకిఫ్ డేట్స్ ఫెస్టివల్‌

దోహా: సౌక్ వాకిఫ్ లోకల్ డేట్స్ ఫెస్టివల్ ఎనిమిదవ ఎడిషన్ గురువారం ప్రారంభమైంది. 14 ఖర్జూర రకాలను కలిగి ఉన్న 103 కంటే ఎక్కువ స్థానిక ఫామ్స్ పాల్గొంటున్నాయి. 10 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్ ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. గతేడాది 85లోకల్ ఫామ్స్ పాల్గొన్నాయి. ఫెస్టివల్ లో భాగంగా  కేకులు, టార్ట్‌లు, స్మూతీలు, జామ్‌లు మరియు జ్యూస్‌లతో సహా అనేక రకాల ఖర్జూరం ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారని ఫెస్టివల్ జనరల్ సూపర్‌వైజర్ ఖలీద్ సైఫ్ అల్ సువైదీ తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com