మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్: ట్రక్ ప్రమాదం
- May 16, 2016
మొబైల్ మాట్లాడుతూ ఓ ట్రక్‌ని నడిపిన డ్రైవర్, ఆ ట్రక్ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు బ్రిడ్జిపైనుంచి కిందికి పడిపోయింది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదంలో ఒమన్‌కి చెందిన వ్యక్తితోపాటు, వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. 485 కార్టన్ల మినరల్ వాటర్, జ్యూసెస్, మిల్క్‌ని తరలిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించింది ఆ ట్రక్. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కు వేగం 100 నుంచి 120 కిలోమీటర్లు గంటకు ప్రయాణిస్తోందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంతో రెండు గంటలకు పైనే ట్రాఫిక్ జామ్ అయ్యింది. అతి వేగంతో ప్రయాణిస్తూ ఓవర్టేక్ చేయడంకూడా ఈ ప్రమాదానికి కారణం. 2014తో పోల్చితే 2015లో రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2014లో జరిగిన ప్రమాదాల్లో 816 మంది ప్రాణాలు కోల్పోగా, 2015లో 675 మంది ప్రాణాలు కోల్పోయారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 2015 జులైలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 626 యాక్సిడెంట్లు ఈ నెలలో జరిగాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









