PSLV-C56 రాకెట్ ప్రయోగం విజయవంతం..
- July 30, 2023
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ ను ప్రయోగం విజయంతం అయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ ను ప్రయోగించింది. మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను ఇస్రో విజయంతంగా కక్ష్యలోకి పంపింది. షార్ అంతరిక్ష కేంద్రంలోని
సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది సింగపూర్ కోసం చేపట్టిన పూర్తి కమర్షియల్ ప్రయోగం. మొత్తం నాలుగు దశల్లో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు.
పీఎస్ఎల్వీ సీరిస్ లో ఇది 58వ ప్రయోగం. పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ ప్రయోగమని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







