మోడ్రన్‌ మీడియా పట్ల ఖతారీల్లో ఆసక్తి

- May 16, 2016 , by Maagulf
మోడ్రన్‌ మీడియా పట్ల ఖతారీల్లో ఆసక్తి

మోడ్రన్‌ సొసైటీతో తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని 10 మందిలో 8 మంది ఖతారీలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది. నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఇన్‌ ఖతార్‌ విడుదల చేసిన ఈ సర్వే 'మీడియా యూజ్‌ ఇన్‌ మిడిల్‌ ఈస్ట్‌ 2016' పేరుతో జరిగింది. మోడ్రన్‌ మీడియాని ఖతారీలు ఎక్కువగా వినియోగిస్తున్నారనీ, సాధారణ టెలివిజన్‌ ప్రోగ్రామ్స్‌తో పోల్చితే, ఇతరత్రా మార్గాలపైనే వారు ఎక్కువ దృష్టి పెడ్తున్నారని ఎన్‌యు-క్యూ జర్నలిజం ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జస్టిన్‌ మార్టిన్‌ చెప్పారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ బేస్డ్‌ ప్రింట్‌ మెటీరియల్‌, టెలివిజన్‌ ప్రోగ్రామ్స్‌ విషయంలో అరేబియా (8 శాతం), ఈజిప్ట్‌ (3 శాతం)తో పోల్చితే ఖతారీ మరియు యూఏఈ నేషనల్స్‌ (24 శాతం) ముందంజలో ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది. ఖతారీలు తమ దేశానికి సంబంధించిన విషయాల మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. ఖతారీలు వార్తలపై ఎక్కువ ఫోకస్‌ పెడ్తారు. రీజియన్‌లో మిగతావారితో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా ఖతారీలు ఫేస్‌బుక్‌ని వినియోగిస్తున్నారు. ఖతారీలు ట్విట్టర్‌ని పలు విధాలుగా వినియోగిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ట్విట్టర్‌ ద్వారా తెలుసుకోవడం, తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com