జవాన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

- July 31, 2023 , by Maagulf
జవాన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్  తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘జవాన్’. ఈ చిత్రంలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో నయనతార  హీరోయిన్ గా నటిస్తుంటే, విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. దీపికా పదుకొనే, ప్రియమణి , తమిళ్ హీరో విజయ్ ముఖ్య పాత్రల్లో మెరవబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు చిత్ర యూనిట్.. ప్రమోషన్స్ కూడా చేస్తూ వస్తుంది.

ఇటీవలే ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ‘దుమ్మే దులిపేలా’  అనే సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సాంగ్ ని దాదాపు 1000 మంది డాన్సర్స్ తో తమిళ్ కొరియోగ్రాఫర్ శోభి గ్రాండ్ గా డిజైన్ చేశాడు. కేవలం ఈ ఒక్క పాట తీయడానికే 15 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం.

కాగా ఈ పాటలో ప్రియమణి, షారుఖ్ తో కలిసి మరోసారి మాస్ స్టెప్పులు వేసింది. గతంలో షారుఖ్ సూపర్ హిట్ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఒక స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూనే.. ఈ సాంగ్ లో షారుఖ్ తో కలిసి డాన్స్ వేసి ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటలో ఒక షారుఖ్ తప్ప మిగిలిన డాన్సర్స్ అంతా ఆడవాళ్లే కావడం గమనార్హం. సాంగ్ లో కనిపించిన విజువల్స్ బట్టి చూస్తుంటే.. షారుక్ లేడీస్ జైలుకి జైలర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com