డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ అస్సలు తగ్గేదేలే.!
- July 31, 2023
‘లైగర్’ దెబ్బతో డీలా పడిపోయిన పూరీ జగన్నాధ్, తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబయ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసేశాడు సక్సెస్ ఫుల్గా.
ఇక రెండో షెడ్యూల్ కోసం విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ని నభూతో న భవిష్యతి అనే రేంజ్లో తెరకెక్కించబోతున్నాడట. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసేశాడట.
యాక్షన్ ప్రధానాంశంగా ఈ షెడ్యూల్ వుండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, బాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మల్ని దించే యోచన చేస్తున్నాడనీ తెలుస్తోంది.
‘లైగర్’తో తగిలిన షాక్ నుంచి కోలుకోవడానికి పూరీకి కాస్త ఎక్కువే టైమ్ పట్టిందనుకోవచ్చు. ఏది ఏమైనా ఆ షాక్ నుంచి తేరుకుని, ‘డబుల్ ఇస్మార్ట్’ని డబుల్ రేంజ్లో రూపొందించబోతున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్లోనే ఈ సినిమా కూడా రూపొందబోతోంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







