19 మిలియన్ గ్యాలన్లు దాటిన నీటి వినియోగం
- August 01, 2023
కువైట్: గత రెండు రోజులలో దేశంలో నీటి వినియోగం రేటు ఉత్పత్తి రేటు కంటే దాదాపు 19 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వరకు పెరిగింది. ప్రస్తుతం 3,793 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్‌ల వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వల ద్వారా మంత్రిత్వ శాఖ కొరతను భర్తీ చేస్తోంది. నీటి వినియోగ రేట్లు 518 మిలియన్ గ్యాలన్ల రికార్డుకు చేరుకున్నాయి. అయితే ఉత్పత్తి రేటు 499 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. 50 - 52 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ వారం మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వచ్చే ఆగస్టు చివరి నాటికి అధిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!