సౌదీ ఫెన్సింగ్ కోచ్ ఇంట్లో అగ్నిప్రమాదం...నలుగురు పిల్లలు మృతి
- August 01, 2023
రియాద్: అగ్ని ప్రమాదంలో తన నలుగురు పిల్లలు మరణించినందుకు సౌదీ ఫెన్సింగ్ కోచ్ కెప్టెన్ అలీ బిన్ ఇబ్రహీం అల్-ఒబైద్‌కు సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ సంతాపం తెలిపారు. తూర్పు ప్రావిన్స్‌లోని అల్-అహ్సా గవర్నరేట్‌లోని అల్-ఒమ్రాన్ పట్టణంలో అల్-అదాలా క్లబ్ ఫెన్సింగ్ జట్టు కోచ్ అల్-ఒబైద్ ఇంట్లో శుక్రవారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తన నలుగురు పిల్లలు మరణించారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద సంఖ్యలో సౌదీలు అల్-ఒబైద్ కు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారు అల్-ఒబైద్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్ నుండి మంటలు చెలరేగి, అపార్ట్మెంట్లో పిల్లలు నిద్రిస్తున్న రెండవ అంతస్తుకు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అలీ అల్ ఒబైద్ మీడియాతో తెలిపారు. మంటల నుండి వెలువడిన పొగను అధికంగా పీల్చడంతో పిల్లలు నిద్రలోనే మరణించారని పేర్కొన్నారు. నలుగురు పిల్లలూ 10 ఏళ్లలోపు వారే. హెబా పెద్దది 10 సంవత్సరాలు కాగా, హుస్సేన్‌కు తొమ్మిది సంవత్సరాలు, లియాన్ రెండు సంవత్సరాలు, ఒక ఏడాది ఉన్న రహాఫ్ చిన్నవాడు. ఎయిర్ కండీషనర్ పవర్ ప్లగ్ నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!