సైమా అవార్డ్స్: RRR, సీతారామం సినిమాలకి హైయెస్ట్ నామినేషన్స్..
- August 02, 2023
హైదరాబాద్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) అవార్డు వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయని తెలిసిందే. ఈసారి కూడా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయిలో ఘనంగా సైమా వేడుకలు జరగనున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలకు ఈ అవార్డు వేడుకలు జరుగుతాయి.
తాజాగా సైమా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించారు. 2022 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈ సంవత్సరం అవార్డులు ఇస్తారు. తెలుగులో అత్యధికంగా RRR సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత సీతారామం సినిమా 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. తెలుగులో బెస్ట్ ఫిలిం కేటగిరిలో RRR, సీతారామం, కార్తికేయ 2, మేజర్, డీజే టిల్లు సినిమాలు పోటీలో ఉన్నాయి. మరి వీటిల్లో ఏ సినిమా ఈ సారి సైమా బెస్ట్ ఫిలిం అవార్డు సాధిస్తుందో చూడాలి.
తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు అత్యధికంగా 10 నామినేషన్స్ రాగా, కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు 9 నామినేషన్స్ వచ్చాయి. తమిళ్ లో బెస్ట్ ఫిలిం కేటగిరిలో లవ్ టుడే, పొన్నియిన్ సెల్వన్ 1, రాకెట్రి, తిరు, విక్రమ్ సినిమాలు పోటీలు ఉన్నాయి.
కన్నడలో KGF 2, కాంతార సినిమాలు అత్యధికంగా 11 నామినేషన్స్ సాధించాయి. కన్నడలో బెస్ట్ ఫిలిం కేటగిరిలో 777 చార్లీ, కాంతార, KGF 2, లవ్ మాక్ టైల్ 2, విక్రాంత్ రోనా సినిమాలు పోటీలో ఉన్నాయి.
మలయాళంలో భీష్మపర్వం సినిమా అత్యధికంగా 8 నామినేషన్లు, తుళ్లుమల్ల సినిమా 7 నామినేషన్లు దక్కిండుకుంది. మలయాళం బెస్ట్ కేటగిరి ఫిలింలో భీష్మ పర్వం, జయ జయ జయ జయహే, హృదయం, తుళ్లుమల్ల, నా తాన్ కేస్ కోడు, జనగణమన సినిమాలు పోటీలో ఉన్నాయి.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







