దుబాయ్ లో ఆస్పత్రిలో చేరిన భారతీయ నటుడు
- August 02, 2023
దుబాయ్: భారతీయ నటుడు రాకేశ్ బాపట్ హీట్‌స్ట్రోక్ కారణంగా దుబాయ్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఆయన తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో వేదిక ద్వారా ముచ్చటించాడు. దుబాయ్‌లో షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాకేష్ ఇటీవల హాస్పిటల్ బెడ్‌పై నుండి తన చేతిని వీడియో పోస్ట్ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రాకేశ్ చివరిసారిగా మరాఠీ చిత్రం 'సర్సేనాపతి హంబీరావ్'లో కనిపించాడు. 'బిగ్ బాస్ 15', 'బిగ్ బాస్ OTT'లో అతను పాపులర్ నటుడిగా మారాడు. మహిళా నటి షమితా శెట్టితో విడిపోయిన కారణంగా ఈ నటుడు ఇటీవల వార్తల్లో నిలిచాడు. మరోవైపు యూఏఈలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 49°Cకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!