Dh150కే దుబాయ్ నుంచి సలాలకు బస్సు ప్రయాణం

- August 02, 2023 , by Maagulf
Dh150కే దుబాయ్ నుంచి సలాలకు బస్సు ప్రయాణం

యూఏఈ: ఒమన్‌లోని సలాలాలో ఖరీఫ్ (ఋతుపవనాలు) సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.టూరిస్టులు అందమైన వాతావరణం,  పచ్చదనాన్ని ఆస్వాదించడానికి గార్డెన్ సిటీ ఆఫ్ మిడిల్ ఈస్ట్‌కు తరలివస్తారు. కాగా, ప్రస్తుతం ఈ మార్గంలో విమాన ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, యూఏఈ నివాసితులు బస్సులో నాల్గవ వంతు ధరతో ప్రయాణించగలిగే అవకాశం ఉంది. బడ్జెట్ ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో ఆగస్ట్ మొదటి వారంలో విమాన ఛార్జీలు వన్-వే టిక్కెట్ కోసం Dh2,500 కంటే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బస్సు ఛార్జీలు 150 దిర్హామ్‌ల నుండి ప్రారంభమవుతున్నాయి.

 దేరా లో ఉన్న అల్ ఇమారత్  ఎక్స్‌ప్రెస్ జనరల్ ట్రాన్స్‌పోర్ట్ నివాసితుల కోసం దుబాయ్ నుండి సలాలాకు మూడు వారపు బస్సు సర్వీసులను అందిస్తుంది.  బస్సు గోల్డ్ సూక్ బస్టాండ్ నుండి సోమవారం, గురువారాలు, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సలాలాకు చేరుకుంటుందని అల్ ఇమారత్ ఎక్స్‌ప్రెస్ జనరల్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ మొహమ్మద్ కసెమ్ తెలిపారు. ఈ సర్వీస్ యూఏఈ నివాసితులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఆరు నెలల చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, మూడు నెలల రెసిడెన్సీ వీసా ఉండాలని కాసెమ్ స్పస్టం చేశారు. అయితే, యూఏఈకి వచ్చే సందర్శకులుకు బస్సులో ప్రయాణించే అవకాశం లేదన్నారు. వన్-వే ట్రిప్ ధర Dh150, ఒక రౌండ్ ట్రిప్ ధర Dh280గా ఉందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com