‘ఉస్తాద్’ ఆగిపోలేదా.?

- August 02, 2023 , by Maagulf
‘ఉస్తాద్’ ఆగిపోలేదా.?

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోయిందంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగుతోంది. మొన్న జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హరీష్ శంకర్ రాకపోవడానికి కారణం కూడా ఇదే అన్న అనుమానం కూడా లేకపోలేదు. సినిమా అప్‌డేట్ గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియకే హరీష్ ఆగిపోయాడన్న వాదన వుంది.

అయితే, అలాంటిదేమీ లేదనీ, తాజా పరిణామాల దృష్ట్యా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కోసం జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎక్కువగా ఏపీలోనే పవన్ కళ్యాణ్ గడపాల్సి వస్తుంది. 

ఈ క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లోనే సెట్స్ వేసి, హరీష్ శంకర్ సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేయబోతున్నాడట. పవన్ కళ్యాణ్ లేని సీన్లను హైద్రాబాద్‌లో షూట్ చేయబోతున్నారట. ఇలా ఓ పక్కా ప్లానింగ్‌తో ‘ఉస్తాద్’ కంప్లీట్ చేసేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com