కళ్ల కలక వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు.!
- August 02, 2023వాతావరణంలో మార్పులు సంభవించగానే కళ్ల కలక అందర్నీ ఇబ్బంది పెడుతుంటుంది. వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా అలర్జీ వల్ల ఈ కళ్ల కలక వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి విషయంలో కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ అత్యంత చికాకు పెట్టే కళ్ల కలకను తగ్గించుకోవడానికి వైద్యులు సూచించే మందులతో పాటూ, శారీరక పరిశుభ్రతనూ పాటించడం తప్పని సరి.
కళ్ల కలక వచ్చినప్పుడు కళ్లు ఎర్రబారడం, దురదలు, తీవ్రమైన నొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటివి సహజంగా చూస్తుంటాం. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా వున్నవారిలో గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కూడా వుంటాయని వైద్యలు చెబుతున్నారు.
కళ్ల కలక వచ్చినప్పుడు తరచూ డెటాల్తో చేతులు శుభ్రం చేసుకోవడం, డెటాల్లో ముంచిన ఖర్చీప్తో తరచూ కళ్లను తుడుచుకోవడం చేయాలి. కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని కొంత అరికట్టవచ్చు.
ఇమ్యూనిటీని పెంచే ఫోషక విలువలున్న ఆహారం తీసుకుంటే, ఈ వ్యాధి ప్రభావం పెద్దగా వుండదని కొన్ని రోజుల వ్యవధిలోనే తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్