ఈ యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీలు చెల్లవు..

- August 02, 2023 , by Maagulf
ఈ యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీలు చెల్లవు..

న్యూ ఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించింది. ఏ డిగ్రీని ఇవ్వడానికైనా సరే ఆయా విశ్వవిద్యాలయాలకు ఎటువంటి అధికారమూ లేదని చెప్పింది.

దేశంలో అన్నింటికన్నా ఎక్కువ నకిలీ విశ్వవిద్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ఢిల్లీలో అటువంటి వర్సిటీలు మొత్తం ఎనిమిది ఉండగా, ఉత్తరప్రదేశ్ లో నాలుగు నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని యూజీసీ తెలిపింది.

యూజీసీ చట్టానికి విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు అందిస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అటువంటి విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీలకు గుర్తింపు ఉండబోదని, ఉన్నత విద్య, ఉద్యోగాలకు అవి చెల్లబోవని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి తెలిపారు.

ఢిల్లీలోని నకిలీ వర్సిటీలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్
దర్యాగంజ్ లోని కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్
యూనైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం
వృత్తి విశ్వవిద్యాలయ
ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ
స్పిరిట్యుయల్ యూనివర్సిటీ

ఉత్తరప్రదేశ్‌లోని నకిలీ వర్సిటీలు
గాంధీ హిందీ విద్యాపీఠం
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)
భారతీయ శిక్షా పరిషత్

ఆంధ్రప్రదేశ్‌లోని నకిలీ వర్సిటీలు
క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా

పశ్చిమ బెంగాల్లోని నకిలీ వర్సిటీలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్

ఇంకా..
కర్ణాటకలోని బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
మహారాష్ట్రలోని రాజా అరబిక్ యూనివర్సిటీ
పుదుచ్చేరిలోని శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com