కళ్ల కలక వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు.!

- August 02, 2023 , by Maagulf
కళ్ల కలక వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు.!

వాతావరణంలో మార్పులు సంభవించగానే కళ్ల కలక అందర్నీ ఇబ్బంది పెడుతుంటుంది. వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా అలర్జీ వల్ల ఈ కళ్ల కలక వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి విషయంలో కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ అత్యంత చికాకు పెట్టే కళ్ల కలకను తగ్గించుకోవడానికి వైద్యులు సూచించే మందులతో పాటూ, శారీరక పరిశుభ్రతనూ పాటించడం తప్పని సరి.

కళ్ల కలక వచ్చినప్పుడు కళ్లు ఎర్రబారడం, దురదలు, తీవ్రమైన నొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటివి సహజంగా చూస్తుంటాం. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా వున్నవారిలో గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కూడా వుంటాయని వైద్యలు చెబుతున్నారు.

కళ్ల కలక వచ్చినప్పుడు తరచూ డెటాల్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం, డెటాల్‌లో ముంచిన ఖర్చీప్‌తో తరచూ కళ్లను తుడుచుకోవడం చేయాలి. కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని కొంత అరికట్టవచ్చు. 

ఇమ్యూనిటీని పెంచే ఫోషక విలువలున్న ఆహారం తీసుకుంటే, ఈ వ్యాధి ప్రభావం పెద్దగా వుండదని కొన్ని రోజుల వ్యవధిలోనే తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com