రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: కువైట్

- August 03, 2023 , by Maagulf
రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: కువైట్

కువైట్: ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జీవితాలను రక్షించడానికి, ఆరోగ్య సేవల అభివృద్ధికి రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించాలని విదేశీ ఆరోగ్య సేవల వ్యవహారాల MoH అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ యాకూబ్ అల్-తమర్ చెప్పారు. రక్త మార్పిడికి సంబంధించిన సేవలకు మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ మద్దతునిస్తుందన్నారు. ఏడాది పొడవునా రక్తదానం మరియు ప్రచారాలను నిర్వహించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి కృషి చేస్తుంది. ఏటా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రక్తదానంపై అవగాహన కల్పిస్తుందన్నారు. అన్ని రోజులలో రక్త దాతలు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.  గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రక్తదానాల సంఖ్య 60 శాతం పెరిగిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com