విమాన టికెట్లు రూ. 511 నుంచే !
- May 17, 2016
రిటర్న్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించడంతో స్పైస్ జెట్ కూడా మళ్లీ ఆఫర్ల వ్యవహారంలోకి దిగింది. తన 11వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల సేల్ ప్రకటించింది. స్వదేశీ విమాన టికెట్లను రూ. 511 నుంచి (బేస్‌ఫేర్ మాత్రమే), విదేశాలకు వెళ్లే విమానాల్లో టికెట్లను రూ. 2,111 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బుకింగ్స్ మంగళవారం నుంచి మొదలై గురువారం (మే 19) వరకు ఉంటాయి. ఆరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ ప్రకటించింది.అలా బుక్ చేసుకున్న టికెట్లతో స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగాను, విదేశీ ప్రయాణాలు అయితే జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. కేవలం స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. అయితే, ఈ ఆఫర్‌లో టికెట్లు పరిమితంగా ఉన్నాయని, అందువల్ల ముందు వచ్చినవాళ్లకు ముందు అనే పద్ధతిలోనే వీటిని కేటాయిస్తామని స్పైస్‌జెట్ తెలిపింది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







