ఛార్మి తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది..
- May 17, 2016
టాలీవుడ్ బొద్దుగుమ్మ ఛార్మి ఈ సంవత్సరం తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. 1987, మే 17న జన్మించిన ఛార్మి నేటితో 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా మంచి సక్సెస్లు సాధించిన ఛార్మి మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో కలిపి దాదాపు 40 సినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడికి మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖీ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మీ చిత్రం ఛార్మీకు విమర్శకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రం త్వరలో రూపొందనుండగా, చిత్ర టైటిల్ ఛార్మి క్రియేషన్ బ్యానర్ పై రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను ఛార్మీ నే నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఛార్మి, తను ఎంచుకున్న రూట్లో మరిన్ని సక్సెస్లు సాధిస్తూ ముందుకెళ్ళాలని మనసారా కోరుకుందాం.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







