కాలుష్య భయంతో పారిస్ ఒలింపిక్స్ స్విమ్ ఈవెంట్ రద్దు
- August 08, 2023
ఒమన్: ఫ్రాన్స్‌లోని సీన్ నదిలో ఆదివారం జరగాల్సిన ప్రీ-ఒలింపిక్స్ స్విమ్మింగ్ ఈవెంట్ నీటి కాలుష్యం కారణంగా రద్దు చేయబడిందని వరల్డ్ ఆక్వాటిక్స్ తెలిపింది. మహిళల 10k రేసు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 07:30 గంటలకు (0530 UTC) షెడ్యూల్ చేయబడింది. పురుషుల 10k నాలుగు గంటల తర్వాత నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. అయితే పారిస్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని గుండా వెళ్లే సీన్ నది కాలుష్యాంతో నిండిపోయింది. "పారిస్‌లో ఇటీవలి సగటు కంటే ఎక్కువ వర్షపాతం కారణంగా.. ఈతగాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి సీన్‌లోని నీటి నాణ్యత ఆమోదయోగ్యమైన ప్రమాణాల కంటే తక్కువగా ఉంది" అని అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ బాడీ నీటి నమూనాలను విశ్లేషించిన అనంతరం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఆగస్ట్ 17-20 తేదీలలో జరగనున్న టెస్ట్ ఈవెంట్‌లో ట్రైఅథ్లెట్‌లు సీన్‌లో పోటీ పడతారని, రాబోయే రోజుల్లో నీటి నాణ్యతను నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్ క్రీడలకు జూలై 26 నుండి ఆగస్టు 11, 2024 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రారంభ వేడుక ఒలింపిక్ స్టేడియం లోపల కాకుండా సెయిన్‌లో జరగనుంది. కనీసం 600,000 మంది ప్రజలు నది ఒడ్డు నుండి వీక్షిస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









