వేములవాడ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- August 08, 2023 , by Maagulf
వేములవాడ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

తెలంగాణ: మంత్రి కేటీఆర్ నేడు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. వేములవాడ ఏరియా ద‌వాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తారు. బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com