కువైట్ లో రెండు నెలల్లో 100 మంది ప్రవాసులు బహిష్కరణ

- August 08, 2023 , by Maagulf
కువైట్ లో రెండు నెలల్లో 100 మంది ప్రవాసులు బహిష్కరణ

కువైట్: రెండు నెలల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు సుమారు 100 మంది నివాసితులను దేశం నుండి బహిష్కరించారు. నివేదికల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అధిక వేగం, రోడ్లపై నిర్లక్ష్యంగా ఉండటం లేదా అక్రమంగా ప్రయాణీకులను తీసుకెళ్లడం వంటి తీవ్రమైన నేరాల కారణంగా సంబంధిత వ్యక్తులపై  బహిష్కరణ వేటు వేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రాఫిక్ పెట్రోలింగ్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమకు అదేశాలు అందినట్టు పేర్కొన్నారు. ప్రవాస కార్మికులు ఉన్న కొన్ని ప్రాంతాలలో ఒక ప్రణాళిక బద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను, వారు ఉపయోగించే వాహనాల మన్నికను తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎవరైనా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com