ఖతార్ ఎయిర్ వేస్ 'సూపర్ సమ్మర్ సేల్'
- May 17, 2016
ఖతార్ ఎయిర్ వేస్ సూపర్ సమ్మర్ సేల్ ఆఫర్‌ని తమ విమాన ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జీసీసీ స్టేట్స్ అంతటా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ డెస్టినేషన్స్‌కి హాలీడేస్ ప్యాకేజీని 25 శాతం డిస్కౌంట్ ఆఫర్‌గా 'సూపర్ సమ్మర్ సేల్'ని ప్రకటించింది. మే 25 వరకు బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దుబాయ్ లేదా అబుదాబీ వెళ్ళాలనుకునేవారు, బీచ్ బ్రేక్‌లో భాగంగా మాల్దీవ్స్ లేదా పుకెట్, లండన్, ప్యారిస్, బ్యాంకాక్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది సూపర్ ఆఫర్ అని ఖతార్ ఎయిర్ వేస్ వర్గాలు వెల్లడించాయి. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను జిసిసి రెసిడెంట్స్ బుక్ చేసకునేందుకు అవకాశం ఉంది. మే 25 లోపు బుక్ చేసుకునేవారికి జూన్ 30 వరకు ప్రయాణించవచ్చు. ఈ హాలీడే ప్యాకేజీలో లగ్జరీ బోటిక్ రిసార్ట్స్ కూడా భాగం పంచుకుంటున్నాయి. ఖతార్ ఎయిర్ వేస్ హాలీడేస్ వెబ్సైట్లో మరిన్ని వివరాల్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









