బహ్రెయిన్‌లో ఇండియన్ నేవీ షిప్స్
- May 17, 2016
ఇండియన్ నేవీకి చెందిన దీపక్, తర్కష్ మరియు ఢిల్లీ అనే మూడు యుద్ధ నౌకలు బహ్రెయిన్‌లో గుడ్‌విల్ విజిట్‌లో భాగంగా కొలువుదీరాయి. మే 16 నుంచి 19 వరకు ఈ నౌకలు బహ్రెయిన్‌లో ఉంటాయి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ నేవీ వెస్ట్రన్ కమాండ్‌కి చెందిన యుద్ధ నౌకలు ఇవి. గతంలో ఈ తరహా గుడ్‌విల్ విజిట్ 2015 సెప్టెంబర్‌లో జరిగింది. గల్ఫ్ దేశాలతో సుమారు 4 వేల ఏళ్ళుగా సముద్ర యానం ద్వారా భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అత్యాధునిక యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, ఎయిర్ క్రాఫ్టులు, మెరైన్ కమెండోలతో ఇండియన్ ఓషన్‌లో అతి పెద్ద నావికాదళంగా ఇండియన్ నేవీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత్, బహ్రెయిన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాలూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నాయి చాలాకాలంగా. వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ, పెట్టుబడులు, విద్య, భద్రతా సహకారం వంటి విభాగాల్లో ఇరు దేశాలూ సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. బహ్రెయిన్ నేవీ అధికారులు, ఇండియన్ నేవల్ అకాడమీ నిర్వహించే అడ్మిరల్ కప్ సెయిలింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని, బహుమతులు కూడా గెలుచుకుంటున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







