గ్యాస్ నొప్పికీ, గుండె పోటుకీ తేడా ఏంటీ.?
- August 09, 2023
కొందరికి అప్పుడప్పుడూ ఛాతిలో నొప్పి వస్తుంటుంది. ఛాతీ నొప్పే కదా.. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
అయితే, కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి తీవ్రతరం కావచ్చు. ఇదే గుండె నొప్పికి సంకేతం కూడా కావచ్చు. అయితే, ఛాతీ నొప్పినీ, గుండె నొప్పినీ ఎలా విభేదించి చూడొచ్చు. ఏ నొప్పి ఏంటని ఎలా గుర్తించొచ్చు.? అంటే కొన్ని రకాల లక్షణాల ద్వారా గుర్తించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తల భాగం నుంచి నడుము పై భాగం వరకూ వచ్చే కొన్ని నొప్పులు గుండె నొప్పికి సంకేతాలుగా చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది ఛాతీ నొప్పి.
ఛాతీ నొప్పి కొన్ని సెకన్ల పాటు వుండి తగ్గిపోతే ఎలాంటి సమస్య లేదు. కానీ, తీవ్రమైన తేన్పులు రావడం, ఆవలింతలు రావడం, భుజం నొప్పి, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని గుండెపోటుగా అనుమానించాలనీ, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలనీ సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, కూల్ డ్రింక్స్, కాఫీలు అధికంగా తాగే అలవాటున్న వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువనీ హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్, కాఫీలు తాగే వారందరికీ గుండె నొప్పి ప్రమాదం వుందని కాదు కానీ, మితి మీరి తాగేవారికే ఈ హెచ్చరిక.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







