హార్డ్ షోల్డర్ ఓవర్‌టేకింగ్‌పై డేగకన్ను
- May 17, 2016
దుబాయ్ పోలీసులు సరికొత్త డివైజ్‌తో హార్డ్ షోల్డర్ ఓవర్‌టేకింగ్‌పై డేగ కన్ను వేయనున్నారు. ఈ డివైజ్‌లో అత్యాధునికమైన కెమెరా ఉంటుందనీ, హై క్వాలిటీతో ఫొటోలను తీస్తుందని దుబాయ్ పోలీస్ చీఫ్ మేజర్ జనరల్ ఖామిస్ మట్టర్ అల్ మజెనా చెప్పారు. దుబాయ్ రోడ్లపై ఈ తరహా డివైజ్‌లు 20 ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తునామని ఆయన అన్నారు. దుబాయ్ రోడ్లపై భద్రతే ప్రధాన ధ్యేయంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మట్టర్ అల్ మజెనా వివరించారు. హార్డ్ షోల్డర్ ఓవర్‌టేకింగ్‌కి 600 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, ఆరు బ్లాక్ పాయింట్స్, వీటితోపాటుగా ఒక నెల ఇన్‌పౌండ్‌మెంట్ విధించనున్నారు. హార్డ్ షోల్డర్ ఓవర్‌టేకింగ్ అత్యంత ప్రమాదకరమనీ, అత్యంత వేగంగా వాహనాల్ని అతి ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వుంటుందని ప్రతి వాహనదారుడూ అనుకోవాలని ఆయన చెప్పారు. ఈ డివైజ్ దుబాయ్ పోలీస్ శాఖ సాంకేతిక పనితీరుకు నిదర్శనమని ఖామిస్ మట్టర్ అల్ మజెనా వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







