దుబాయ్‌లో వేజ్ మానిటరింగ్ సిస్టమ్
- May 17, 2016
కంపెనీలు తమ ఉద్యోగులకు జీత భత్యాల చెల్లింపులు ఎలా చేస్తున్నాయనే విషయాన్ని మానిటరింగ్ చేసేందుకోసం వేజ్ మానిటరింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. నాలుగు ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆరెంజ్ టీమ్ ఈ సిస్టమ్‌ని రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ మానిటిరింగ్ డిపార్ట్మెంట్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ సుల్తాన్ అబ్దుల్ హమీద్ అల్ జమాల్ చెప్పారు. ఆరెంజ్ టీమ్ కో-ఆర్డినేటర్ కూడా అయిన అల్ జమాల్ మాట్లాడుతూ, కార్మికులు ఆరోగ్యకరమైన వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేలా యజమానులు చర్యలు తీసుకోవాలనీ, ఈ దిశగానే ఈ ఆరెంజ్ టీమ్ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తుందని చెప్పారు. కార్మికుడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా చూడటం ఆరెంజ్ టీమ్ బాధ్యత అని ఆయన వివరించారు. దుబాయ్ కోర్ట్స్, దుబాయ్ పోలీస్, పర్మనెంట్ కమిటీ ఫర్ లేబర్ ఎఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ విభాగాలు సంయుక్తంగా ఈ ఆరెంజ్ టీమ్‌ని ఏర్పాటు చేశాయి. వలస కార్మికులకు ఇక్కడి చట్టాల గురించి అవగాహన కల్గించే కార్యక్రమాలు చేపట్టడం, అలాగే వారి హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయడం అనే ముఖ్యమైన ఉద్దేశ్యంతో ఆదివారం ఆరెంజ్ టీమ్ ప్రతినిథులు ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







