ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్..
- August 10, 2023
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా కస్టమర్లకు వ్యక్తిగత రుణాలను అందించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పర్సనల్ లోన్ సర్వీస్ ద్వారా రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను అందిస్తుంది. అలాగే ఆయా రుణాలపై కస్టమర్లుకు 6 నుంచి 36 నెలల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. అయితే ఈ లోన్ ఎలా పొందాలో? మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
లోన్ పొందడం ఇలా చెయ్యాలి
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు తమ లోనల్ల ఆమోద ప్రక్రియ కేవలం 30 సెకన్లలో పూర్తవుతుంది. రుణ దరఖాస్తును ప్రారంభించడానికి కస్టమర్‌లు పాన్ నెంబర్, పుట్టిన తేదీ, వర్క్ వివరాల వంటి ప్రాథమిక వివరాలను అందించాలి. ఈ వివరాలను అందించిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వారి రుణ పరిమితిని ఆమోదిస్తుంది. కస్టమర్లు వారి సౌకర్యవంతమైన నెలవారీ రీపేమెంట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారి ఇష్టపడే లోన్ మొత్తాన్ని, రీపేమెంట్ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రుణ దరఖాస్తును ఖరారు చేసే ముందు సమగ్ర లోన్ సారాంశం, రీపేమెంట్ వివరాలు, రివ్యూ కోసం నిబంధనలు, షరత్తులను ఓ సారి తెలుసుకోవడం మంచింది.
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో వ్యూహాత్మక సహకారం ద్వారా కస్టమర్లకు సరసమైన చెల్లింపు ఎంపికల విస్తృత శ్రేణితో విజయవంతంగా సాధికారత కల్పించామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబతుఉన్నారు. బీఎన్‌పీఎల్‌తో పాటు, ఈఎంఐలతో సహా బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో పర్సనల్ లోన్ సర్వీస్‌ను పరిచయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు. లిక్విడిటీకి ప్రాప్యతను మంజూరు చేయడం ద్వారా క్రెడిట్‌ని ప్రారంభించడం, కొనుగోలు శక్తిని మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా కస్టమర్లకు కొనుగోలు విషయంలో ఫ్లిప్‌కార్ట్ చర్యలు ఎక్కువ సౌలభ్యంతో మరింత సౌకర్యాన్ని అందిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









