రియాద్‌లో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు
- August 12, 2023
రియాద్: రియాద్‌లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సుమారు 1,394,000 యాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఒక గిడ్డంగిలో ఎలక్ట్రికల్ మెషీన్ల సరుకులో దాచి ఉన్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. దీంతో అధికారుల బృందం దాడి చేసి యాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి) ప్రతినిధి మేజర్ మార్వాన్ అల్-హజిమి చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నివాసితులను ( ఒక జోర్డానియన్, ఒక సిరియన్) అరెస్టు చేసినట్లు మేజర్ అల్-హజిమి తెలిపారు. మక్కా, రియాద్ మరియు అల్-షర్కియా ప్రాంతాలలో 911.. సౌదీ అరేబియాలోని 999కి కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ప్రమోట్‌కు సంబంధించిన కార్యకలాపాల గురించి సమాచారం అందివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









