జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..
- August 12, 2023
బ్రిటీష్ రాక్షస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించి ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయులను మనసారా తలుచుకుంటాం. మువ్వన్నెల జెండా ఎగరేసి భారత జాతి ఔన్నత్యాన్ని చాటుకుంటాం. మన జాతీయ జెండాలోని రంగులు .. అసలు జెండా ఎగరవేసేటపుడు పాటించాల్సిన నియమాలు ఓసారి తెలుసుకుందాం.
పింగళి వెంకయ్య మన జాతీయ పతాకాన్ని రూపొందించారు. జెండాలోని కాషాయం రంగు దేశ పటిష్టత, ధైర్యానికి ప్రతీక. మధ్యలో ఉండే తెలుపు శాంతికి చిహ్నం. కింద ఉండే ఆకుపచ్చ దేశ ప్రగతిని సూచిస్తుంది. మధ్యలో 24 ఆకులతో నీలం రంగులో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. 1947 జూలై 27 న రాజ్యాంగ సభ ఆమోదించిన తర్వాత నుంచి మనం జాతీయ జెండాను ఎగురవేస్తున్నాం.
జాతీయ జెండా ఖాదీ, కాటన్, సిల్క్‌తో మాత్రమే తయారు చేయాలి. పొడవు, వెడల్పులు ఖచ్చితంగా 2:3 నిష్సత్తిలో ఉండాలి. 6300X4200 మిల్లీ మీటర్ల నుంచి 150X100 మిల్లి మీటర్ల వరకూ 9 రకాల సైజుల్లో జాతీయ జెండాను తయారు చేసుకోవచ్చు.
జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ పై నుంచి కిందకు వచ్చేలా ఎగరవేయాలి. జెండా కిందకు వంచకూడదు. నిటారుగా ఉండాలి. ప్లాస్టిక్‌తో జెండాలు తయారు చేయకూడదు. కాగితంతో జెండాలు చేసుకోవచ్చును అవి చిన్న సైజ్ జెండాలు అయి ఉండాలి. జెండాలో తెలుపురంగు మధ్యలో అశోక చక్రం 24 ఆకులు కలిగి నీలం రంగులో ఉండాలి. జాతీయ జెండాను సూర్యోదయం తరువాత ఎగరేయాలి. అస్తమించకముందు జెండాను దించాలి. ఇతర జెండాలతో జాతీయ జెండాను ఎగురవేస్తే మిగిలిన జెండాల కంటే జాతీయ జెండా ఎత్తులో ఉండాలి. ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి.
తాజా వార్తలు
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!









