ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో అబుధాబి, దుబాయ్, షార్జా
- August 13, 2023
యూఏఈ: అబుధాబి, దుబాయ్ మరియు షార్జా నగరాలు ప్రపంచంలోని అత్యంత సరసమైన కాస్మోపాలిటన్ నగరాల జాబితాలో మొదటి పది స్థానాల్లో నిలిచాయి. నివాసి సగటు నెలవారీ ఆదాయం $6,199, జీవన వ్యయం $752.70తో కువైట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన నగరంగా అగ్రస్థానంలో ఉంది. న్యూయార్క్ అధిక సంపాదన ఉన్నప్పటికీ నివసించడానికి లిస్ట్‌లో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. ఈ మేరకు వర్క్యార్డ్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అధిక ఆదాయాలు, తక్కువ జీవన వ్యయాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన నగరాల జాబితాలో అబుదాబి రెండవ స్థానంలో ఉంది. ఇక్కడి నివాసితులు ప్రతి నెలా దాదాపు $7,154 ఇంటికి తీసుకుపోతారని, వారి జీవన వ్యయాలపై సుమారు $873.10 ఖర్చు చేస్తారని తెలిపారు. రియాద్ మూడవ అత్యంత సరసమైన నగరంగా నిలిచింది. ఇక్కడ సగటు నెలవారీ ఆదాయాలు $6,245, జీవన వ్యయాలు $814.90 వరకు ఉన్నాయి. దుబాయ్ మరియు షార్జాలు జాబితాలో నాల్గవ, ఐదవ స్థానంలో ఉన్నాయి. నివాసితులు వరుసగా నెలకు $7,118, $5,229 ఆదాయాన్ని పొందుతుండగా.. జీవన ఖర్చులు ప్రతి నెల $1,007, $741.30 గా పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ బయట ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సంపాదించడానికి, జీవించడానికి అనువైన ప్రదేశంగా ఎంపికైంది. సగటు నెలవారీ ఆదాయం $7,312, జీవన వ్యయం సుమారు $1,079.20గా నమోదైంది. ఓస్లో( నార్వే) నివాసితులు నెలకు సుమారు $7,543 సంపాదిస్తున్నారు.జీవన వ్యయాలపై సుమారు $1,121.50 ఖర్చు చేస్తున్నారు. లండన్ మరియు శాన్ ఫ్రాన్సిస్కోలు వరుసగా $8,411, $9,249 నెలవారీ ఆదాయాలతో జాబితాలో 8వ, 9వ స్థానంలో ఉన్నాయి. ఈ నగరాల్లో జీవన వ్యయాలు నెలకు $1,260.80, $1,440.10 గా ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









