అల్-హజియ్యత్ ప్రాంతంలో వీధి ఆక్రమణలు తొలగింపు

- August 14, 2023 , by Maagulf
అల్-హజియ్యత్ ప్రాంతంలో వీధి ఆక్రమణలు తొలగింపు

బహ్రెయిన్ : బహ్రెయిన్ సదరన్ మునిసిపాలిటీ నిన్న రిఫ్ఫాలోని అల్-హజియాత్ ప్రాంతంలో అక్రమ వ్యాపారులు, వీధి వ్యాపారులు, కాలిబాటలపై ఆక్రమణలను తొలగించేందుకు భారీ డ్రైవ్‌ను నిర్వహించింది. బ్లాక్ 939 నుండి ప్రారంభించి, తాత్కాలిక సెటప్‌లతో కాలిబాటలను ఆక్రమించిన ఎనిమిది మంది వీధి పెడ్లర్‌ల షాపులను అధికారులు తొలగించారు. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను విక్రయించడానికి విక్రయదారులు ఉపయోగించే ఎనిమిది డిస్ప్లే ప్లాట్‌ఫారమ్‌లను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆహారం, పానీయాలు, దుస్తులను, విక్రయించడానికి అనధికారిక సెటప్‌లతో రోడ్లపై తిష్ట వేసిన విక్రేతల దుకాణాలను తొలగించారు. ఫుట్‌పాత్‌ల పై ఏర్పాటు చేసిన వాహనాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ విక్రయదారులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, అనేక దుకాణాలకు వారి ఉల్లంఘనలకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయని అధికారులు తెలిపారు. మునిసిపల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సదరన్ గవర్నరేట్ పోలీస్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీతో సంయుక్తంగా డ్రైవ్ చేపట్టింది. దక్షిణ ప్రాంత మునిసిపాలిటీ పౌరులు, నివాసితులు చట్టవిరుద్ధమైన విక్రేతల నుండి వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలని,  భద్రత మరియు ఆరోగ్య అవసరాలను అనుసరించి విక్రయించే సముదాయాల్లోని కొనుగోళ్లు చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com