మరో చరిత్రకు శ్రీకారం చుడుతున్న ఇస్రో..
- August 14, 2023
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడి అధ్యయనం కోసం చంద్రయాన్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవలే చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలో ఉంది. ఇక ఇప్పుడు ఇస్రో.. మరో చరిత్రకు శ్రీకారం చుడుతోంది. త్వరలో సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1(Aditya L-1) మిషన్‌ను చేపట్టనున్నది. అయితే ఆదిత్య ఎల్-1 మిషన్‌కు చెందిన ఫోటోలను సోమవారం ఇస్రో అప్‌డేట్ చేసింది. బెంగుళూరులో తయారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకున్నది. తొట్టతొటి సారి సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో సమాయాత్తమైంది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









