కువైట్‌లో ఘనంగా భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- August 16, 2023
కువైట్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు కువైట్ లో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అంబాసిడర్ హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. తన ప్రసంగంలో భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు కువైట్‌లోని భారతీయ సమాజంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు కువైట్ నాయకత్వానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా సహాయం కోరే భారతీయ పౌరులందరికీ రాయబార కార్యాలయం తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.
కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు తెలియజేసారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి చెందాలని ఆకాంక్షించారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









