హైపర్ పిగ్మెంటేషన్ (బ్లాక్ స్కిన్) సమస్యకు కారణాలు, పరిష్కారాలు.!
- August 16, 2023కొందరిలో ముఖం, మెడపై అక్కడక్కడా చర్మం నల్లగా మారిపోతుంటుంది. ఇలా మారడానికి అనేక కారణాలున్నాయ్. అధిక సూర్యకాంతిలో తిరగడం వల్ల కావచ్చు. లేదంటే చెమట అధికంగా పట్టడం అనే కారణం కావచ్చు. మృత కణాలు అక్కడి చర్మంపై పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది.
అయితే, వైద్య పరిభాషలో చర్మం ఇలా నల్లగా మారడానికి మరో కారణం కూడా వుంది. అదే హైపర్ పెగ్మెంటేషన్. దీనికి సంబంధించిన హార్మోన్లు అధికంగా రిలీజ్ కావడం వల్ల కూడా చర్మం ఇలా నల్లగా మారే అవకాశాలున్నాయట.
హైపర్ పెగ్మెంటేషన్ టెస్ట్ ద్వారా దీన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఆ నలుపు తగ్గించుకోవచ్చంటున్నారు సంబంధిత వైద్య నిపుణులు.
ఒకవేళ హార్మోన్స్ ప్రాబ్లెమ్ కాదని తెలిస్తే కనుక, ఆయా భాగాల్లోని చర్మంపై నలుపు తగ్గించుకునేందుకు సులువుగా ఇంటి చిట్కాలున్నాయ్. పెద్దగా కష్టపడకుండా, కాస్తంత టైమ్ కేటాయిస్తే చాలు.. ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయ్. తాజా అలోవెరా జెల్‌ని ముఖంపై లేదా మెడపై నల్లగా మారిన చోట అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే మంచి ఫలితం వుంటుంది.
అలాగే, పెరుగులో పసుపు, గంధం, నిమ్మకాయ రసం వేసి పేస్ట్‌లా చేసి నలుపు వున్న చోట పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసినా మంచి ఫలితం వుంటుంది.
అలాగే బంగాళా దుంప ట్యాక్సిన్ల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. బంగాళా దుంపను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండి నలుపు వున్న భాగంలో రాస్తే కొన్ని వారాల్లోనే మెడ చుట్టూ వున్న నలుపు పోయి కాంతివంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!