6 నెలల్లో బహ్రెయిన్ కు 5.9 మిలియన్ల సందర్శకులు

- August 17, 2023 , by Maagulf
6 నెలల్లో బహ్రెయిన్ కు 5.9 మిలియన్ల సందర్శకులు

బహ్రెయిన్ : బహ్రెయిన్ సందర్శకుల సంఖ్య ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో 51% పెరిగి 3.9 మిలియన్ల నుండి 5.9 మిలియన్లకు చేరింది. BTEA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. నాసర్ అల్ ఖైదీ సమక్షంలో జరిగిన బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ బోర్డు సమావేశంలో పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ పాల్గొని మాట్లాడారు.  2022–2026 పర్యాటక వ్యూహంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో పురోగతిని అల్ సైరాఫీ ప్రశంసించారు. సమావేశంలో ప్యానెల్ జనవరి-జూన్ 2023 మధ్యకాలంలో తాజా ప్రధాన పర్యాటక సూచికలను సమీక్షించింది.  2022లో 5.8 మిలియన్ల సందర్శకల సంఖ్యతో పోల్చితే.. 2023 మొదటి అర్ధ భాగంలో సందర్శకుల సంఖ్య 54 శాతం పెరిగి 8.9 మిలియన్లకు చేరుకుందని తెలిపారు.  మొత్తం ఇన్‌బౌండ్ టూరిజం ఆదాయాలు 2023 సంవత్సరం మొదటి అర్ధభాగంలో 48% పెరిగి BD924 మిలియన్‌లకు చేరాయని ప్రకటించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com