బంపరాఫర్. ఫ్లైట్ టిక్కెట్‌ ధరను వాయిదాలలో చెల్లించవచ్చు..!

- August 17, 2023 , by Maagulf
బంపరాఫర్. ఫ్లైట్ టిక్కెట్‌ ధరను వాయిదాలలో చెల్లించవచ్చు..!

యూఏఈ: ఇప్పుడు ప్రయాణించి.. తర్వాత చెల్లించే అవకాశాన్ని సౌదీ ఎయిర్ క్యారియర్ ఫ్లైనాస్ అందిస్తుంది. ఇటీవలే ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్‌ను ప్రకటించింది. షాపింగ్, ఇతర ఆర్థిక సేవల కోసం ఉపయోగించే యాప్ అయిన టాబీతో పార్టినర్‌షిప్ ఒప్పందం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ డిమాండ్ పెరగడంతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు ఫ్లైనాస్ వెల్లడించింది. 51 విమానాల సముదాయంతో ఫ్లైనాస్ సౌదీ అరేబియాలో మరియు దుబాయ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు సేవలను అందిస్తున్నది.  జూలైలో స్కైట్రాక్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో వరుసగా 6వ సారి ప్రపంచంలోని నాల్గవ అత్యుత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా..  మధ్యప్రాచ్యంలో అత్యుత్తమ తక్కువ-ధర క్యారియర్‌గా పేరుపొందింది. ఫ్లైనాస్‌తో ప్రయాణించే ప్రయాణీకులు తమ విమాన సర్వీసులను ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా  యాప్ లేదా 24/7 కాల్ సెంటర్ (920001234) లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com