నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
- August 18, 2023
అమరావతి: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ లోపు మరో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అలాగే త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కాగా, గ్రూప్-2 సిలబస్ లో భారీ మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇక, 17ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు వివరించారు. ఇవాళ గ్రూప్ 1 తుది ఫలితాలను గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త నోటిఫికేషన్ల గురించి వివరాలు వెల్లడించారు.
గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ మాట్లాడుతూ "త్వరలో 1,199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఇవి కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తాం. సెప్టెంబర్ లోపు గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. త్వరలోనే గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ నూ విడుదల చేస్తాం. గ్రూప్-1 లో 100 పోస్టులు, గ్రూప్-2 లో వెయ్యి పోస్టులకుపైగా ఖాళీలు భర్తీ చేస్తాం. గ్రూప్స్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడతాం. నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. ఉద్యోగ నియామకాలపై వదంతులు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు”.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









