ప్రపంచ పర్యాటకరంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలి: సీఎం జగన్
- August 18, 2023
విజయవాడ: సిఎం జగన్ విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించారు. హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా, గుడివాడ అమర్ నాథ్, తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్ కు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని తెలిపారు. కేవలం విజయవాడలోనే కాకుండా ఇలాంటి హోటల్స్ ఏపీ అంతటా రావాలని చెప్పారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు.

తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









