స్వయంభు: సమర యోధుడిలా సిద్దార్ధ్.!

- August 18, 2023 , by Maagulf
స్వయంభు: సమర యోధుడిలా సిద్దార్ధ్.!

‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ సిద్దార్ధ్ కెరీర్ చాలా మారిపోయింది. మంచి కాన్సెప్ట్ వున్న కథాంశాల్ని ఎంచుకుంటున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కూడా.

ఇటీవల ‘స్పై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నిఖిల్ సిద్దార్ధ్ కొత్త ప్రాజెక్టును తాజాగా లాంఛ్ చేశాడు. ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ రిలీజ్ చేశారు తాజాగా మేకర్లు. 

కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘స్వయంభు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక, ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదని ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్ధమవుతోంది. శక్తివంతమైన సమర యోధుడిలా కనిపిస్తున్నాడు నిఖిల్ ఈ పోస్టర్‌లో.

గుర్రంపై నుంచి డ్రాగన్ పైకి బాణం విసురుతూ కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో నిఖిల్ గెటప్ కూడా చాలా కొత్తగా వుంది. పొడుగాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. ఫాంటసీ తరహా మూవీలా అనిపిస్తోంది. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి మరి, ఈ కొత్త కాన్సెప్ట్‌తో నిఖిల్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టనున్నాడో.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com