ఉదయ్ కిరణ్ బయోపిక్.! ఈ సారి పక్కానా.?

- August 18, 2023 , by Maagulf
ఉదయ్ కిరణ్ బయోపిక్.! ఈ సారి పక్కానా.?

గత కొన్నాళ్లుగా దివంగత హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కబోతోందన్న వార్తలు వినిపిస్తూన్నాయ్. కానీ, కార్య రూపం దాల్చడం లేదు. మళ్లీ తాజాగా ఈ న్యూస్ తెర పైకి వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాత ముందుకు రావడంతో, ఓ యంగ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాడట.

త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ అంటే ఒకప్పుడు యూత్ సెన్సేషన్. ఫెయిల్యూర్ అనేదే లేకుండా వరుస హిట్లతో స్టార్ హీరో అనిపించుకున్నాడు అతి తక్కువ కాలంలోనే హీరోగా ఉదయ్ కిరణ్.

అయితే, దురదృష్టవశాత్తూ, ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా కింద పడిపోయాడు. కెరీర్ చివరల్లో చాలా కష్టాలు పడ్డాడు. కొన్ని ప్రాధాన్యత లేని సినిమాలను కూడా ఒప్పేసుకున్నాడు. దాంతో, కెరీర్ మొత్తం అటకెక్కేసింది.

సినీ జీవితం అలా వుంటే, అటు వ్యక్తిగత జీవితంలోనూ ఉదయ్ కిరణ్‌ చాలా స్ర్టగుల్స్ ఫేస్ చేశాడన్న ప్రచారం వుంది. ఇవన్నీ ఆయనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని అర్ధాంతరంగా తనువు చాలించాడనీ అంటారు. 

అయితే, వాస్తవమేంటనేది తెలీదు. కానీ, సినిమాలో కొన్ని ఆసక్తికరమైన నిజ సంఘటనల్ని చూపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com