ట్రాఫిక్ అలెర్ట్ : కీలక రహదారిపై వేగ పరిమితి తగ్గింపు

- August 20, 2023 , by Maagulf
ట్రాఫిక్ అలెర్ట్ : కీలక రహదారిపై వేగ పరిమితి తగ్గింపు

యూఏఈ: వర్షం కారణంగా ఎమిరేట్‌లోని కీలక రహదారిపై అబుధాబి పోలీసులు వేగపరిమితిని తగ్గించారు. Msaken మరియు Kuraa మధ్య అల్ ఐన్-దుబాయ్ రోడ్డులో వేగ పరిమితిని 120కిమీలకు తగ్గించినట్టు అధికార యంత్రాంగం సోషల్ మీడియాలో తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని,  ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను అనుసరించాలని అబుధాబి పోలీసులు వాహనదారులకు పిలుపునిచ్చారు. మరోవైపు శనివారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులు డ్రైవర్లకు ఈ అలెర్ట్ జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com