షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకున్న ఇండియన్ నావల్ షిప్
- August 20, 2023
కువైట్: భారత నౌకాదళ నౌక INS విశాఖపట్నం కువైట్ లోని షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. కమాండ్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ ఆధ్వర్యంలోని నౌకాదళ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ కు షువైక్ పోర్ట్లో కువైట్ నేవల్ ఫోర్సెస్, బోర్డర్ గార్డ్స్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. ద్వైపాక్షిక నౌకాదళ సహకారంలో భాగంగా ఇండియన్ నావల్ షిప్ కువైట్ చేరకుందని అధికార యంత్రాంగం తెలిపింది. అనేక భారతీయ పాఠశాలల విద్యార్థులు కూడా షువైఖ్ పోర్ట్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ నౌకకు స్వాగతం పలికారు. భారత నౌకాదళం, కువైట్ నావికా దళం మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అభ్యాసాలలో ఈ నౌక పాల్గొననుంది.
INS విశాఖపట్నం లీడ్ షిప్. విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లలో మొదటిది. మజాగాన్ డాక్ లిమిటెడ్ దేశీయంగా నిర్మించబడిన ఈ షిప్ ను 21 నవంబర్ 2021న ప్రారంభించారు. భారత నావికాదళంతో సేవలో ఉన్న అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఇది ఒకటి. ఈ 164 మీటర్ల ఓడలో అత్యంత అధునాతన నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్ధ్యంతో నిర్మించారు. ఈ నౌకలో రెండు హెలికాప్టర్లను తీసుకెళ్లేందుకు వీలుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సవాళ్లను ఎదుర్కొనేలా దీనిని నిర్మించారు.
తాజా వార్తలు
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు









