సంక్రాంతి రేస్‌లో ‘హనుమ్యాన్’.! బుడ్డోడు పెద్ద ప్లానే వేశాడుగా.!

- August 21, 2023 , by Maagulf
సంక్రాంతి రేస్‌లో ‘హనుమ్యాన్’.! బుడ్డోడు పెద్ద ప్లానే వేశాడుగా.!

ఈ ఏడాది సంక్రాంతి రేస్‌లో పెద్ద సినిమాలు చాలానే పోటీ పడుతున్నాయ్. వారితో పాటూ, తానేం తక్కువ కాదంటూ తన సినిమానీ బరిలో దించుతున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో తేజ సజ్జా. ‘హనుమ్యాన్’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘ఆది పురుష్’ టీజర్‌తో పోటీగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు తేజ సజ్జా. గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుందని ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ టైమ్‌లో. 
అయితే ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ కావల్సి వుండగా, సీజీ వర్క్ పెండింగ్ కారణంగానే రిలీజ్ కాలేదు. సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ అదీ కుదరలేదు. 
లేటెస్ట్‌గా సంక్రాంతిని మనోడు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. జనవరి 12న ఈ సినిమా పక్కాగా రిలీజ్ అవుతుంది. ఇది ఫిక్స్.. అంటున్నారు తాజాగా ‘హనుమ్యాన్’ మేకర్లు. అన్నట్లు ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. 
అక్టోబర్‌లో అదిరిపోయే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరగడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం డిఫరెంట్ కంటెంట్‌ ఇన్నోవేటివ్‌గా సిద్ధం చేసి వుంచారట. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com