డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు గుడ్డు (ఎగ్) తినొచ్చా.?
- August 21, 2023
నేటి కాలంలో డయాబెటిస్‌తో బాధపడే వారు చాలా ఎక్కవైపోయారు. వయసుతో సంబంధం లేకుండానే ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తోంది. జన్యుపరమైన కారణాలు కూడా షుగర్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే, షుగర్ ఒక్కసారి వస్తే తగ్గించుకోవడం కష్టమే.. అనే అపోహలుంటాయ్ చాలా మందిలో.
అయితే అది కేవలం అపోహం మాత్రమే అంటున్నారు నిపుణులు. షుగర్ వ్యాధిని కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా నియంత్రణలో వుంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, డయాబెటిస్ వున్నవారు కోడి గుడ్డు తీనకూడదని అంటుంటారు. అందులో ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు డయాబెటిక్ నిపుణులు.
గుడ్డులో ప్రొటీన్స్ ఎక్కువగా వుంటాయ్. అందువల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా మితంగా ఆహారం తీసుకుంటాం. షుగర్ వ్యాధి గ్రస్థులు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. బరువు కంట్రోల్‌లో వుంచడం డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు పాటించాల్సిన మొట్ట మొదటి నియమం. సో, ఎటువంటి అపోహ, అనుమానం లేకుండా డయాబెటిస్ వున్నవాళ్లు కోడిగుడ్డును తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







