భారత్ 40% సుంకం ప్రకటించడంతో ఉల్లి ధరలు పెరుగుతాయా?

- August 22, 2023 , by Maagulf
భారత్ 40% సుంకం ప్రకటించడంతో ఉల్లి ధరలు పెరుగుతాయా?

యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయలను ఎగుమతి చేసే భారతదేశం ఇటీవల కూరగాయలపై 40 శాతం సుంకాన్ని ప్రకటించింది. భారతీయ ఉల్లిపాయలకు అతిపెద్ద మార్కెట్లలో యూఏఈ  ఉన్నప్పటికీ.. దేశంలోని రిటైలర్లు వాటి లభ్యత లేదా ధరలపై ప్రభావం చూపదని అంటున్నారు.పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. టర్కీ, ఈజిప్ట్, గ్రీస్, యుఎస్, ఇటలీ వంటి ఇతర ప్రధాన మార్కెట్‌ల నుండి కూడా కూరగాయలు లభిస్తున్నందున యూఏఈలో ఉల్లిపాయలకు కొరత లేదన్నారు. సరఫరా-డిమాండ్ అసమతుల్యత కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్ సుంకాన్ని విధించాలని నిర్ణయించింది.  ఉల్లిపాయలపై భారత ఎగుమతి సుంకం కారణంగా రిటైల్ మార్కెట్ పెద్దగా ప్రతికూల ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి.నందకుమార్ తెలిపారు. “గత సంవత్సరం ఇదు సమయంలో భారతదేశం ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించింది. ఈ సంవత్సరం అది జరుగుతుందని మేము ఊహించాము. మేము సిద్ధంగా ఉన్నాము. టర్కీ, ఈజిప్ట్, గ్రీస్, కొన్ని ఇతర పొరుగు దేశాల నుండి ప్రత్యామ్నాయంగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ” అని నందకుమార్ తెలిపారు.  మరోవైపు భారత్ లో  సప్లై-డిమాండ్ అసమతుల్యత కారణంగా ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలలో పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. రిటైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ ప్రారంభం నుండి ధరలు గణనీయంగా పెరుగుతాయని,  కిలోకు రూ.60-70 వరకు చేరుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com