మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి
- August 25, 2023
హైదరాబాద్ : కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్‌రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సిఎం కెసిఆర్ తనకు రెండో సారి మంత్రి పదవీ అందించినందకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్, తాండూరు జిల్లాలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో తాను స్వల్ప తేడాతో రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయానని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. వాస్తవానికి రెండు, మూడు రోజుల కిందటే మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ గవర్నర్ తమిళి సై పాండిచ్చేరిలో ఉండటంతో ప్రమాణ స్వీకారం ఈరోజు చేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







