సెప్టెంబరు 1 నుంచి డిజిటల్‌గా ట్రాఫిక్ టిక్కెట్లు
- August 29, 2023
కువైట్: సెప్టెంబర్ 1 నుండి అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయబడతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ ఆదేశాలతో డిజిటల్ పరివర్తనలో భాగంగా అంతర్గత మంత్రిత్వ శాఖ పోలీసు అధికారుల కోసం 'రాసెడ్' యాప్‌ను ప్రారంభించింది. దీనిద్వారా అధికారులు ట్రాఫిక్ టిక్కెట్లను డిజిటల్‌గా జారీ చేయనున్నారు. "Rased" యాప్ నివాసితుల కోసం 'Sahel' యాప్‌తో అనుసంధానించబడింది. 'రాసెడ్' యాప్‌లో పోలీసు అధికారి డిజిటల్‌గా అప్లోడ్ చేసినప్పుడు డ్రైవర్ ట్రాఫిక్ టిక్కెట్లను వెంటేనే అందుకుంటాడు. ట్రాఫిక్ జరిమానాలను వేగంగా జారీ చేయడానికి, జరిమానాలను వసూలు చేయడానికి తద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించే మంత్రిత్వ శాఖ ప్రయత్నంలో ఈ కొత్త చర్య భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పౌరులు, నివాసితులు ట్రాఫిక్ నియమాలు, పోలీసుల సూచనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!







